![]() |
![]() |

మాధవి ఈ పేరు ఎవరికీ తెలియకపోవచ్చు కానీ మిర్చి మాధవి అంటే ఈజీగా గుర్తుపట్టేస్తారు. ప్రస్తుతం పలు సీరియల్స్, సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'క్యారవాన్ అనేది ఒక పెద్ద జోక్' అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
"ఒక ఫేమ్ ఉన్న ఆర్టిస్ట్స్ కి మాత్రమే క్యారవాన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మిగతా వాళ్ళకైతే ఇద్దరుముగ్గురికి కలిపి ఒక క్యారవాన్ ఇస్తారట..అది నిజమేనా ?" అని యాంకర్ అడిగిన ప్రశ్నకు.. "మాధవి నవ్వుతూ క్యారవాన్ అనేది ఒక పెద్ద జోక్. క్యారవాన్ అనేది రెండు కారణాలకు మాత్రమే ఉపయోగపడుతుంది. వాష్ రూమ్స్ లేని చోట ఒకసారి, డ్రెస్ చేంజ్ చేసుకోడానికి మరో సారి మాత్రమే పనికొస్తుంది. ఆ తర్వాత ఎవరికి వాళ్ళు సెట్ లోకి షూటింగ్స్ కి వెళ్ళిపోతారు.
ఐతే పొరపాటున ఎవరి క్యారవాన్ లోకైనా వెళ్తే నా క్యారవాన్ లోకి వచ్చావేంటి అంటూ పెద్ద రచ్చ చేస్తూ ఉంటారు. ఐతే నా క్యారవాన్ లోకి ఎవరైనా వస్తే మాత్రం నాకు నచ్చదు. ఎందుకంటే వచ్చిన వాళ్ళు ప్రశాంతంగా కూర్చుంటే పర్లేదు కానీ గంటలు గంటలు ఫోన్స్ మాట్లాడుతూ అక్కడ వున్న ప్రశాంతతని చెడగొడుతూ ఉంటారు. అది నాకు నచ్చదు. నాకు మనస్శాంతి చాలా ఇంపార్టెంట్. అందుకే నాకు ఎలాంటి క్యారవాన్ వద్దు బాబోయ్ అని ఒక కుర్చీ వేసుకుని ఏదో ఒక చెట్టు కింద కూర్చుండిపోతాను.
నాకు మనస్శాంతి, ఆనందం ఈ రెండు ఆక్సిజన్ లాంటివి ..అవి లేనప్పుడే కోపం, చిరాకు అన్నీ వస్తాయి. ఐతే ఇదివరకు క్యారవాన్ అనేది లేదు ఇప్పుడే ఇచ్చారు. క్యారవాన్ లోకి వెళ్ళేటప్పుడు కొన్ని చోట్ల కొంత మంది కొరకొరా కోపంగా చూస్తూ ఉంటారు. అందుకే నాకు క్యారవాన్ అంటే ఇష్టం ఉండదు. దానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది" అంటూ దణ్ణం పెట్టింది మిర్చి మాధవి.
![]() |
![]() |